NTV Telugu Site icon

రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ పోస్టర్ విడుదల

Stand Up Rahul Movie Poster Released

గత యేడాది రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఈ యేడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ పెద్దంత సందడి చేయలేదు. అలానే మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో ఈ యంగ్ హీరో ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు, కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి ఇవాళ రాజ్ తరుణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ‘స్టాండప్ రాహుల్’ చిత్రబృందం తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ చూస్తే మంచి కామెడీ పండించే స్టాండప్ కమెడియన్ పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నట్లు అనిపిస్తుంది. రాజ్ తరుణ్ స్మైలింగ్ సైడ్ యాంగిల్ ఫేస్ తో.. జనాల మధ్య నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందకుమార్ అబ్బినేని – భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు. మరి ‘స్టాండప్ రాహుల్’తో అయినా రాజ్ తరుణ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.