NTV Telugu Site icon

SSMB29: అబ్బే.. ఇప్పట్లో కష్టమేనమ్మా!

Ssmb29

Ssmb29

SSMB29 Regular shoot Pushed to January 2025: ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళిని ఆయన సన్నిహితులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమాని అంతలా చెక్కుతూ ఉంటాడు కాబట్టి. ఆయన మామూలుగానే ఒక సినిమాకి 6 నుంచి 7 నెలల ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకుంటాడు. రెండేళ్లు సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిస్తూ ఉంటాడు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు కాబట్టి సాధారణంగా అంత సమయం పడుతుంది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడంతో ఇప్పుడు ఆయన మరింత కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుతో 29వ సినిమాని రాజమౌళి చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆరేడు నెలలు కాదని ఏకంగా సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ కోసమే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Mythri Movie Distributors : ఒకే వారం.. మూడు సినిమాలు

అందుకే ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టాలి అనుకున్నారు కానీ వచ్చే ఏడాది జనవరికి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి వర్క్ షాప్స్ అలాగే ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి షూటింగ్ డేట్ జనవరికి మార్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. మహేష్ బాబుతో పాటు సినిమాలో కీలకమైన వ్యక్తులు, వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నారు. సినిమా కోసం మహేష్ బాబు ఎప్పటికీ గడ్డం పెంచి బాడీని కూడా సాలిడ్ గా తయారు చేసే పనిలో ఉన్నాడు. కానీ సెప్టెంబర్ లో మొదలవుతుంది అనుకున్న షూటింగ్ మాత్రం జనవరికి మారింది. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. కీరవాణి సంగీతం అందించబోతున్నారు. ఇక రెగ్యులర్గా సెంథిల్ తో సినిమాలు చేసే రాజమౌళి ఈ సినిమా మాత్రం ఆయనతో చేయబోవడం లేదని తెలుస్తోంది.

Show comments