Site icon NTV Telugu

SSMB29 : ఫస్ట్ గ్లింప్స్ తో పాటు.. భారీ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ కూడా ఆ రోజేనా..?

Ssmb29 Epic

Ssmb29 Epic

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB29పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించనుండటం మరింత స్పెషల్‌గా మారింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కెన్యా, నైరోబిలో జోరుగా సాగుతోంది. మహేష్ బాబు తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే సందర్భంగా రాజమౌళి ఫస్ట్ గ్లింప్స్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ..

తాజాగా ఫిలింసర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఆ గ్లింప్స్‌తో పాటు సినిమా అధికారిక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందట. ఈ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీమ్ ఆలోచిస్తోందని సమాచారం. అయితే దీనిపై పూర్తి క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూడాల్సిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి ప్రత్యేకమైన కథా శైలితో, మహేష్ బాబు గ్లోబల్ లుక్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రపంచ స్థాయి విజువల్ స్పెక్టకిల్గా ఉండబోతుందని ఇప్పటికే ఫిల్మ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ఎపిక్ అనౌన్స్‌మెంట్ నిజంగానే రాబోయే రోజుల్లో జరుగుతుందా..? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version