సూపర్‌స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ పై దేశవ్యాప్తంగా అమితమైన అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన బయటకు వచ్చింది.
Also Read : Sunny Leone : సరోగసీ అనుభవాలు పంచుకున్న పొర్న్ బ్యూటీ..
ఏంటీ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ఓపెన్ ఏరియాలో ఒక ప్రత్యేక సెట్ వేశారు. చెరువు దగ్గర కీలక సన్నివేశాలు చిత్రీకరించాలన్న ఉద్దేశంతో మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్ రెడీ అయ్యాక మహేశ్ అక్కడికి వెళ్లారు. కానీ కేవలం అరగంటకే వేడి తట్టుకోలేక చిరాకు పడి.. “నా వల్ల కాదు, సారీ” అంటూ వెళ్లిపోయారట. ఫలితంగా ఆ షెడ్యూల్ పూర్తిగా ఆగిపోయి, దాదాపు రెండు కోట్ల రూపాయల సెట్ వృధా అయిందని టాక్.
ఇలాంటివి మహేశ్‌కు కొత్తేమీ కాదు. గతంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ సమయంలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆరుబయట ఎండలో పాట చిత్రీకరణ చేయలేనని మహేశ్ చెప్పడంతో, ఆ సీక్వెన్స్‌ను ఇండోర్‌లోనే అవుట్‌డోర్ సెట్‌గా డిజైన్ చేశారు. అప్పట్లో ఆ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు రాజమౌళి సినిమా విషయంలోనూ అలాంటి పరిణామం జరగడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, మహేశ్ బాబు కంఫర్ట్ జోన్‌కు తగ్గట్టే మేకర్స్ సెట్ మార్చుకోవాల్సి వస్తోంది. కానీ ఈ సంఘటన మాత్రం ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
