Site icon NTV Telugu

SSMB 29 : SSMB 29 : జక్కన్న.. నువ్వు మామూలోడివి కాదయ్యా

Ssmb 29, Mahesh Babu Rajamouli

Ssmb 29, Mahesh Babu Rajamouli

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి, RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన చిత్రాల తర్వాత, ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి ఇప్పటివరకు ఎన్నడూ చూడనంతగా భారీగా సెట్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని తిరిగి రూపు దిద్దుతున్నారు. ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇస్తూ, నదీ తీరాలు, ఘాట్‌లు, పురాతన దేవాలయాలు వంటి అన్ని వివరాలతో ఈ సెట్‌ను డిజైన్ చేస్తున్నారని సమాచారం.

Also Read : Rajasab : ‘రాజా సాబ్’ నుండి.. అదిరిపోయే అప్ డేట్ లీక్ చేసిన బ్యూటీ !

ఒరిజినల్ విజువల్స్ కోసం నిజమైన వారణాసిలో చిత్రీకరించాలని ఆలోచన ప్రారంభంలో ఉండగా, లాజిస్టికల్ సమస్యలు, అనుమతులు, జనసంచారం, భద్రత వంటి అంశాల నేపథ్యంలో ప్రత్యేకంగా సెట్‌ ఏర్పాటు చేయాలని రాజమౌళి నిర్ణయించారట. ఇంతవరకు బాలీవుడ్‌లో లగ్జరీ సెట్లకు పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘హీరామండి’ వంటి చిత్రాలకు రూ. 15 నుంచి రూ. 50 కోట్ల దాకా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాజమౌళి ప్రాజెక్ట్ ఈ మొత్తం ఖర్చు మించిపోతూ భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది. ఇక ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనుండగా. ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్‌కు అంచనా బడ్జెట్ ఏకంగా రూ. 1000 కోట్లు అన్నది ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Exit mobile version