ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న “SSMB 29” ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుంచి హైప్ నెలకొంది. ఇక రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని హాలీవుడ్‌కు ధీటుగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా తీసుకు వస్తున్నారట. ఇక పోతే ఈ మూవీ ప్రారంభం నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి..
Also Read :Nagarjuna : తమిళ రీమేక్‌పై కన్నేసిన నాగ్.. 100వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ఆర్. మాధవన్ కీలక పాత్రలో చేరిపోయారు. ఆయన ఈ చిత్రంలో మహేశ్ బాబుకు తండ్రి పాత్రలో నటిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాత్ర కోసం నిర్మాతలు మొదటగా నానా పాటేకర్, విక్రమ్ వంటి ప్రముఖులను సంప్రదించారట.. కానీ చివరగా మాధవన్ ఓకే అయ్యారట.
అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్‌ను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. షూటింగ్ స్టార్ట్ అయిందని కానీ, ఇక్కడ షెడ్యూల్ జరుగుతోందని కానీ, నటీనటులు వీళ్లే అని కానీ, టెక్నికల్ టీం ఇదే అని కానీ ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒరిస్సాలో జరిగిన షెడ్యూల్‌లో భాగంగా సీన్లు లీక్ అయ్యాయి. మహేశ్ బాబుని రౌడీలు లాక్కు రావడం, పృథ్వీ రాజ్ సుకుమారన్ కుర్చీలో కూర్చుని ఉండటం కనిపించాయి. ఇక ఇలా లీకులు అవుతున్నాయని రాజమౌళి తన టీంను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి SSMB 29 నుంచి ఎలాంటి లీకులు బయటకు రాలేదు.
