దర్శక దిగ్గజం SS రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB29. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు #GlobeTrotter పేరోతో ఈ నెల 15న హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సినిమా టైటిల్ తో పాటు వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : Thalaivar173 : సుందర్.సి డైరెక్టన్ లో రజినీ సినిమా.. రిస్క్ చేస్తున్నాడా?
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ ను గ్రాండ్ గా మొదలు పెట్టాడు జక్కన్న. 15న ఈవెంట్ నిర్వహిస్తుండగా ఆ లోపు ఆడియెన్స్ కు మరింత జోష్ ఇచ్చేందుకు ఈ సినిమాలోని పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసాడు రాజమౌళి. పృధ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలో కనిపించనున్నట్టుగా తెలిపాడు. వీల్ చైర్‌లో కాళ్లు చేతులు చచ్చుబడిపోయి ఉన్న కుంభ.. రిచ్‌మెన్‌గా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఇప్పటివరకూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించబోతున్నట్టుగా ఉంది. ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంతోషంలో ‘యుద్ధం’ మొదలైంది అని మహేశ్ బాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు పృద్వి. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ షూటింగ్ తర్వాత పృథ్వీ దగ్గరకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాడట రాజమౌళీ. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభ పాత్రకు పృథ్వీ ప్రాణం పోసాడు. తన కుర్చీలో జారిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు ‘ అని ట్వీట్ చేసాడు జక్కన్న.
