NTV Telugu Site icon

SS Thaman: స్పీకర్లు కాలిపోతే కాలిపోనివ్వండి నాకు సంబంధం లేదు

Thaman

Thaman

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ డాకు సినిమా కోసం వీరు క్రియేట్ చేసుకున్న వరల్డ్ చాలా గొప్పది. వరల్డ్ అంటే ఇష్యూ చాలా చాలా గొప్పది. వీళ్ళు పడిన కష్టం కూడా చాలా ఎక్కువ. అఖండ సమయంలో బాలయ్య బాబు కష్టం నేను చూశాను. అది అంత ఈజీ కాదు కరోనా టైంలో అంత దుమ్ముతో, అంత విభూది అవన్నీ చల్లుతారు. ఆ టైంలో లైట్గా దగ్గితేనే నీకు కోవిడ్ అని తీసుకువెళ్లి పోయేవారు. ఆ టైంలో ఎంతో దుమ్ముతో ఎంతో కష్టమైన పరిస్థితులలో ఆ సినిమా చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి ఎంత అయితే కష్టపడ్డారో అంతే కష్టం ఈ సినిమా కూడా పడ్డారు. ఈ సినిమాకి వీరు పడిన కష్టం అంతా ఇంతా కాదు. అనంతపురంలో మాట్లాడాలని మేము పెద్ద పెద్ద స్పీచ్ లు ప్రిపేర్ చేసుకున్నాం. స్పీచ్ అంటే స్పీచ్ అని కాదు ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది. చాలా రోజుల తర్వాత నేను డైరెక్ట,ర్ డిటిఎస్ థియేటర్లో కొట్టుకు చచ్చాము. ఇది అక్కడ ఉండాలి అది ఇక్కడ ఉండాలి అని. డిటిఎస్ ఇంజనీర్ మమ్మల్ని చూసి మీరు గొడవలు ఆపరా అని అడిగారు. అంతలా చిన్నపిల్లల లాగా అవుట్ పుట్ కోసం కొట్టుకుంటూ ఉన్నాము. మీరు చూస్తే గాలిపోయిన ఫుట్బాల్ లాగా మా ముఖాలు తయారయ్యాయి ఎందుకంటే అంత స్ట్రెస్ తీసుకుంటున్నాం. దీని వెనకాల జరిగిన మ్యూజిక్ వర్క్ గానీ ఇతర డిపార్ట్మెంట్స్ వర్క్ గాని చాలా కష్టమని అన్నారు. ఇలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేసినందుకు బాబికి, నాగ వంశీ గారికి థాంక్స్.

Shraddha Srinath: బాలయ్యని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది!

బాలయ్య గారి గురించి నేనేం చెప్పాలి? మా అమ్మ కాల్ చేసి రెండు మూడు మంత్రాలు చదివి ఈరోజు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతుంది. ఆ తర్వాత ఆమె లాగా బాలకృష్ణ కాల్ చేస్తారు. రెండు మంత్రాలు చదివి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. నాకు నాన్న లేరు ఆ లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది. ఆయన నాకు అవకాశాలు ఇస్తున్నారు సినిమాలకు కలిసి పని చేస్తున్నామని కాదు, అది ఒక నమ్మకం. మనం ఎలా అయితే ఇద్దరు పైలట్లను నమ్మి 300 మందిని ఒక విమానం ఎక్కుతున్నామో, బాలకృష్ణ కూడా నన్ను అంతే గుడ్డిగా నమ్మేశారు. ఆ నమ్మకమే నేను ఇంత కష్టపడి పనిచేయడానికి కారణం అవుతోంది. బాలయ్య గారు అంటే 100% ఇస్తాను స్పీకర్లు, కాలిపోతే కాలిపోనివ్వండి మాకు సంబంధం లేదు. కాలతాయి అంతే. దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. బాలయ్య గారి సినిమా అంటే మీరందరూ రెడీ అవ్వండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎలా అంటారో నాది బాలయ్యది సినిమా వస్తుందంటే స్పీకర్లు కాలిపోతాయి. అందుకు సిద్ధంగా ఉండండి అంటూ థమన్ చెప్పుకొచ్చారు. ఇది నేను ఇచ్చే వార్నింగ్ కాదు సినిమాలో ఆ హై ఉందని ఆయన అన్నారు .

Show comments