NTV Telugu Site icon

SS Rajamouli: నా పాన్ ఇండియా సినిమాలకే సూర్యనే ఇన్స్పిరేషన్

Suriya

Suriya

సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రం నవంబర్ 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ రోజు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రాజమౌళితో పాటు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ మా గురించి పెద్ద ఏవీ ప్లే చేశారు అందులో ఇండియాలో పాన్ ఇండియా సినిమాని పరిచయం చేసింది నేనేనని అన్నారు కానీ అలా చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ సూర్య. చాలా సంవత్సరాలు చాలా సార్లు గజినీ టైంలో సూర్య ఎలా ఇక్కడికి వస్తున్నాడు సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. సినిమాని ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా తను చేసే విధానాల్లో మన తెలుగు ప్రజలందరికీ ఎలా దగ్గరయ్యాడు అనేది నాకు ఒక కేసు స్టడీ కింద నేను మన ప్రొడ్యూసర్లకి హీరోలకి చెబుతూ ఉండేవాడిని.

Minister Nadendla Manohar: రైస్‌ మిల్లులలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు

సూర్య ఎలా వచ్చి ఇక్కడికి చేస్తున్నాడో మనం కూడా అక్కడికి వెళ్లి చేయాలి. మనం పుష్ చేయాలి మన సినిమాలను తీసుకువెళ్లాలి మన తెలుగు ప్రజల ప్రేమను ఎలా పొందాడో తమిళ ప్రజల ప్రేమని మనం అలాగే పొందాలని మిగతా చోట్ల ప్రేమని మనం అలాగే పొందాలని చెబుతూ ఉండేవాడిని. సూర్య నువ్వే నా ఇన్స్పిరేషన్ అంటుండగా సూర్య స్టేజి మీదకి వెళ్లారు. రాజమౌళిని హత్తుకుని అభినందనలు తెలియజేశారు. ఒకసారి మేం కలిసి సినిమా చేయాలనుకున్నాము కానీ కుదరలేదు అని ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో సూర్య చెప్పాడు నేను ఆపర్చునిటీ మిస్ అయ్యానని. కానీ అది నేను మిస్ అయ్యాను. నేను సూర్యని చాలా ప్రేమిస్తాను, ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఆన్ స్క్రీన్ ప్రజన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అర్థమవుతుంది అని అంటూనే తాను వేరే పని మీద బయటకు వెళ్లాలి కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్, వెళ్ళిపోతున్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Show comments