రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి, సినిమా ప్రారంభించినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టైటిల్ కానీ, ఏ ఇతర వివరాలు గానీ ముందు వెల్లడించలేదు. ఈ మధ్యకాలంలో రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి, ఆ ఈవెంట్‌లోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక, తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఈ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి, ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు కీరవాణి ఈ సినిమా గురించి పెదవి విప్పడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.
Also Read :Allari Naresh: అల్లరి నరేష్ పరిస్థితేంటి.. ‘ఆల్కహాల్’ అయినా మత్తు ఎక్కించేనా?
రాజమౌళి సోదరుడైన కీరవాణి, దాదాపుగా రాజమౌళి డైరెక్ట్ చేసే అన్ని సినిమాలకు సంగీత దర్శకత్వంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. మొత్తం మీద, రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ అప్‌డేట్ కూడా రావడంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి అంశతో పుట్టిన రుద్ర అనే వ్యక్తిగా కనిపిస్తాడని రాజమౌళి చెబుతున్నారు. అయితే, రాముడికి, రుద్రుడికి ఎలా లింకు పెడతారు అనే విషయం మీద ప్రస్తుతానికి చర్చ జరుగుతోంది. రాజమౌళి ఇప్పటికే షూటింగ్‌ను కూడా చాలా వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్పీడ్‌గా జరుగుతున్నాయి.
