NTV Telugu Site icon

SS Rajamouli on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై ప్రశంసలు కురిపించిన దర్శకధీరుడు

Ss Rajamouli

Ss Rajamouli

SS Rajamouli on Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అభిమానుల సందడి మధ్య ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ రాజమౌళి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ఖాతాలో తన స్పందనను తెలియజేశారు.

Read Also: Chiranjeevi on Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్

“కల్కి 2898 ఏడీ చిత్రం ద్వారా మరో ప్రపంచానికి రూపం కల్పించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని అద్భుతమైన సెట్టింగ్ లు నన్ను వేర్వేరు కాలాలకు తీసుకెళ్లాయి. డార్లింగ్ (ప్రభాస్) తన టైమింగ్ తో, నటనా ప్రతిభతో చంపేశాడంతే! అమితాబ్ గారు, కమల్ సర్, దీపిక గొప్పగా నటించారు. ఈ సినిమాలో చివరి 30 నిమిషాల సమయం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇంతటి భారీ పనితనాన్ని కనబరిచే క్రమంలో అసమాన కృషి చేసిన దర్శకుడు నాగి (నాగ్ అశ్విన్), వైజయంతీ మూవీస్ బృందానికి శుభాభినందనలు” అంటూ దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తొలి రోజే రూ.200 కోట్ల ఓపెనింగ్ ఖాయమని భావిస్తుండగా.. ఈ పాజిటివ్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ రికార్డులు కూడా బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నట్లు ఇది మరో రూ.1000 కోట్ల సినిమా కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కంటే కూడా అమితాబ్, కమల్ హాసన్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.