SrinivasaMangapuram : ఘట్టమనేని ‘జై కృష్ణ’ శ్రీనివాస మంగాపురం ఓవర్సీస్ రివ్యూ

Srineevasam Mangapuram

Srineevasam Mangapuram

ఘట్టమనేని వంశం నుండి తాత సూపర్ స్టార్ కృష్ణ, తండ్రి రమేష్ బాబు, బాబాయ్ మహేశ్ బాబు బ్లెస్సింగ్స్ తో శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసాడు జై కృష్ణ. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరు అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా రొటీన్ పాత చింతకాయ పచ్చడి కథతో, రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగే కథనంతో  తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా కొత్తదనాన్ని పంచలేకపోయింది. ఏదైనా కథలో ఊహించని మలుపు ఉంటుందేమోనని చివరి వరకు ఎదురుచూసే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు అదే అరిగిపోయిన పాత దారిలోనే పయనించింది.

సినిమా ప్రథమార్ధం ‘పాట-ఫైట్-పాట’ ఫార్ములాలో సాగితే, ద్వితీయార్థం కూడా అదే రకమైన ఊహించదగినదిగా ఉంటుంది. ఇందులో ప్రధాన సమస్య ప్రేమకథ.. ఎంతో కాలంగా చూస్తున్న పాత సినిమాల తరహాలోనే ఉండి రొటీన్ గా అనిపిస్తుంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే ఏమాత్రం కుదరలేదు, రైటింగ్ ఎంత వీక్ అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పైగా ఏమాత్రం సందర్భం లేని పాటలు సన్నివేశాల మధ్యలోకి రావడం వల్ల, సినిమాలో బలమైన కథే లేదు అనే విషయాన్ని మరింత స్పష్టంగా వేలెత్తి చూపుతాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఒకే ఒక్క ప్లస్ పాయింట్ సంగీతం మరియు నేపథ్య సంగీతం. సినిమాలో ఉన్న ఎక్కువమంది సహాయ పాత్రలు, సబ్-ప్లాట్స్ ఎటు తేలకుండా మధ్యలోనే ముగిసిపోవడంతో సినిమా గందరగోళంగా మారి అసంతృప్తిని మిగుల్చుతుంది. జై కృష్ణ, రషా తడానీ, మోహన్ బాబు, మాస్టర్ మహేంద్రన్ తమ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ, బలహీనమైన కథ, కథనం, పూర్ ఎగ్జిక్యూషన్ వల్ల వారి కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. మొత్తంమీద ‘శ్రీనివాస మంగాపురం’ మొదటి నుండి చివరి వరకు బోర్ కొట్టించే ఒక నిరాశాజనకమైన చిత్రంగా నిలిచిందని ఓవర్సీస్ ఆడియెన్స్ నుండి వస్తున్న టాక్.