SrinivasaMangapuram : ఘట్టమనేని ‘జై కృష్ణ’ శ్రీనివాస మంగాపురం ఓవర్సీస్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘట్టమనేని వంశం నుండి తాత సూపర్ స్టార్ కృష్ణ, తండ్రి రమేష్ బాబు, బాబాయ్ మహేశ్ బాబు బ్లెస్సింగ్స్ తో శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసాడు జై కృష్ణ. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరు అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా రొటీన్ పాత చింతకాయ పచ్చడి కథతో, రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా కొత్తదనాన్ని పంచలేకపోయింది. ఏదైనా కథలో ఊహించని మలుపు ఉంటుందేమోనని చివరి వరకు ఎదురుచూసే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు అదే అరిగిపోయిన పాత దారిలోనే పయనించింది.
సినిమా ప్రథమార్ధం ‘పాట-ఫైట్-పాట’ ఫార్ములాలో సాగితే, ద్వితీయార్థం కూడా అదే రకమైన ఊహించదగినదిగా ఉంటుంది. ఇందులో ప్రధాన సమస్య ప్రేమకథ.. ఎంతో కాలంగా చూస్తున్న పాత సినిమాల తరహాలోనే ఉండి రొటీన్ గా అనిపిస్తుంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే ఏమాత్రం కుదరలేదు, రైటింగ్ ఎంత వీక్ అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పైగా ఏమాత్రం సందర్భం లేని పాటలు సన్నివేశాల మధ్యలోకి రావడం వల్ల, సినిమాలో బలమైన కథే లేదు అనే విషయాన్ని మరింత స్పష్టంగా వేలెత్తి చూపుతాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఒకే ఒక్క ప్లస్ పాయింట్ సంగీతం మరియు నేపథ్య సంగీతం. సినిమాలో ఉన్న ఎక్కువమంది సహాయ పాత్రలు, సబ్-ప్లాట్స్ ఎటు తేలకుండా మధ్యలోనే ముగిసిపోవడంతో సినిమా గందరగోళంగా మారి అసంతృప్తిని మిగుల్చుతుంది. జై కృష్ణ, రషా తడానీ, మోహన్ బాబు, మాస్టర్ మహేంద్రన్ తమ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ, బలహీనమైన కథ, కథనం, పూర్ ఎగ్జిక్యూషన్ వల్ల వారి కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. మొత్తంమీద ‘శ్రీనివాస మంగాపురం’ జై కృష్ణకు డీసెంట్ డెబ్యూట్ అని ఓవర్సీస్ ఆడియెన్స్ నుండి వస్తున్న టాక్.
Also Read
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
తాజావార్తలు
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!