Site icon NTV Telugu

Srinidhi Shetty: సూపర్‌స్టార్‌‌ కోసం.. డే అండ్ నైట్ షిఫ్ట్స్‌ అయిన రెడీ

Sreenidhi Shety (2)

Sreenidhi Shety (2)

ప్రజంట్ టాలీవుడ్‌లో వినిపిస్తున్న క్రేజీ హిరోయిన్ లలో శ్రీనిధి శెట్టి ఒకరు. కెజిఎఫ్1తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె, కెజిఎఫ్2తో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాన్ ఇండియా ఫేమ్ వచ్చింది. కానీ ఈ క్రేజ్‌ను స్క్రీన్‌పై సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోవడంతో కొంతకాలం పాటు పెద్ద సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా ‘తెలుసు కదా’ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నాఈ సినిమాలో  శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా  నటిస్తోంది.

Also Read : Rashmika: ‘థామా’ హాట్ సాంగ్ వెనుక.. రహస్యని రివీల్ చేసిన రష్మిక

అయితే ప్రోమోషన్స్‌లో శ్రీనిధి యాక్టివ్‌గా పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. “ఒకేసారి సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరి సినిమాకు వర్క్ చేస్తానన్న ప్రశ్న ఎదురైతే, డే & నైట్ షిఫ్ట్‌లో డబుల్ కాల్షీట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని” చెప్పారు. ఈ ఫ్రాంక్ కామెంట్ మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను సంతోషపరిచింది. నెటిజన్లు ఆమె తెలివితేటలతో సమాధానం ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక, వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమాలో హీరోయిన్‌గా నటించనుందనే అనే వార్తల పై కూడా స్పందించింది. ఈ వార్త విన్నానని, కానీ నిజానికి తనకు ఈ విషయం తెలియదని చెప్పారు.

Exit mobile version