Site icon NTV Telugu

OTT : ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి శ్రీ విష్ణు సినిమా

Ott

Ott

యంగ్ హీరో శ్రీవిష్ణ హీరోగా శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓం భీమ్ బుష్‌’. గతేడాది మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మినిమమ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అటు నిర్మతలకు బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్ చేసింది. ఓటీటీలోను ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీ లోకి రాబోతుంది. దాదాపు ఏడాది దాటిన తర్వాత సింప్లీ సౌత్‌ ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది. మే 2 సింప్లీ సౌత్‌ ఓటీటీలో ఓం భీమ్ బుష్ స్ట్రీమింగ్ కానుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ప్రీతి ముకుందన్, అయేషాఖాన్ కీలక పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం లాంగ్ గ్యాప్ తర్వాత సింప్లి సౌత్ లో ఏ మేరకు హిట్ గా నిలుస్తోందో చూడాలి.

Exit mobile version