Site icon NTV Telugu

Sri Vidya : స్నానానికి కూడా.. బిస్లరీ వాటర్ తెప్పించుకున్న హీరోయిన్

Sri Vidya

Sri Vidya

కొంత మంది హీరోయిన్‌లు చాలా డిమాండింగ్‌గా ఉంటారు. నిర్మాతలను  నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా ఓ హీరోయిన్ సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఆమె స్నానానికి కూడా బిస్లరీ వాటర్ కావాలని డిమాండ్ చేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..

Also Read : Arya : ‘సార్పట్ట 2’ మూవీ షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

నటి శ్రీవిద్య.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె తన యాక్టింగ్ తో సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 800కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, నటనతో పాటు పాటలు పాడడంలోనూ, డబ్బింగ్‌లోనూ తన ప్రతిభను చాటారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా.. అటుపై సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ అమ్మ, అక్క, చెల్లి, అత్త వంటి క్యారెక్టర్లతో అలరించారు. ఆమె పండించే భావోద్వేగాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు. అయితే ఓ తెలుగు సినిమా షూటింగ్ సమయంలో రాజమహేంద్రవరం వద్ద గోదావరి నీటితో స్నానం చేయాలంటే గ్లామర్‌ దెబ్బతింటుందని, తనకు కచ్చితంగా బిస్లరీ నీరు తెప్పించాలని పంతం పట్టిందట. అప్పట్లో లీటర్ బాటిల్ రూ.6. దీంతో తప్పేది లేక రెండు బకెట్ల బిస్లరీ నీటిని తెప్పిస్తే అప్పుడు ఆమె స్నానం చేశారట.

Exit mobile version