Site icon NTV Telugu

Sri Simha : స్టార్ హీరో మనవరాలితో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి

Srisimha

Srisimha

టాలీవుడ్ లో మరోసారి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే అక్కినేని నాగా చైతన్య, శోభిత ధూళిపాళ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబరు లో వీరి వివాహ వేడుక గ్రాండ్ గాజరగనున్నటు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరొక యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అతడు మరెవరో కాదు ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, ఉస్తాద్ వంటి సినిమాల్లో నటించాడు శ్రీ సింహ.

Also Read : Ram Charan : నేడు కడపకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

ఇక ఇటీవల విడుదలైన మత్తువదలరా -2 తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు శ్రీసింహ. గత ఆదివారం ఈ కుర్ర హీరో పెళ్లికి సంబందించిన వేడుక హైదరాబాద్ లోని గోల్కొండ ఫోర్ట్ లో గ్రాండ్ గా నిర్వహించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీ మోహన్ మనమరాలు మాగంటి రాగతో శ్రీ సింహ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, సీనియర్ నటుడు నరేష్, పవిత్రతో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు ఎమ్మెల్యేలు హాజరయి నూతన జంటను దీవించారు. త్వరలో వీరి వివాహవేడుకకు సంబంధించి తేదీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధనికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేశ్ బాబు న్యూ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

 

Exit mobile version