తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. దిల్ రాజుకి ఈవెంట్స్ ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో ఆయన పక్కనే ఉన్న సోదరుడు శిరీష్ తో కలిపి ఆమె ఒక పోలిక పెట్టింది. ఎప్పుడో రామలక్ష్మణులు అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం కానీ ఇప్పుడు కళ్ళముందే దిల్ రాజు శిరీష్ కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేసింది.నిజానికి ఫిక్షనల్ అంటే తెలుగులో కల్పిత అని అర్థం. హిందూ సమాజం దేవుడిగా భావించే రాముడిని ఆయన సోదరుడు లక్ష్మణుడిని కల్పిత పాత్రలుగా ఆమె పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు హిందుత్వ వాదులు.
Vijay Devarakonda : అలాంటి మోసాలపై రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హెచ్చరిక!
ఆమె తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశం గురించి తాజాగా ఒక వీడేమో రిలీజ్ చేసింది శ్రీముఖి. అందరికీ నమస్కారం, ఇటీవల కాలంలో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామ్ లక్షణులను ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే, నేను దైవ భక్తురాలినే అందులోనూ రాముడిని అమితంగా నమ్మే దానిని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ ఎప్పుడూ జరగకుండా , వీలైనంత జాగ్రత్త పడతాననని మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీ అందరి క్షమాపణలు కోరుతూ దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను అన్నారు.