స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసి సెన్సేషన్‌గా మారింది. వరుస హిట్స్‌తో తన కంటూ మంచి మార్కెట్ సంపాదించుకుని, త్వరలో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తన తొలి హిందీ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో, టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీలా సమయాన్ని వాడుకొని ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. తాజాగా, సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో లో శ్రీ లీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
Also Read : Dragon : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం స్పెషల్ రోల్స్ – హిందీ, తమిళ హీరోలపై కసరత్తులు!
జగపతి బాబు ఆమెను ప్రశ్నించారు: “ఇండస్ట్రీలో ఒక కంప్లైంట్ ఉంది. ప్రతిదానికి ‘అమ్మా అమ్మా’ అని అడుగుతావా? ఏది చేయాలన్నా ముందుగా అమ్మని అడగాలనే అలవాటు ఉందా?” ఈ ప్రశ్నకు శ్రీలీలా ఇలా సమాధానం ఇస్తూ.. ‘ నా జీవితంలోని ప్రతి నిర్ణయం అమ్మ దగ్గరే ఉంటుంది. 6 నెలల క్రితం వరకు, మా అమ్మ లేకుండా రాత్రి నిద్రపోయే దాన్ని కాదు. రాత్రిలో తప్పనిసరిగా అమ్మ పక్కన ఉండాలి. లేకపోతే మేల్కొన్ని వణికిపోతాను. అమ్మ నన్ను పట్టుకొని నార్మల్ చేస్తుంది. షూట్స్‌కు వెళ్ళినా అమ్మ ఉండాల్సిందే. ఆమె లేకుంటే ఉండటం కష్టం. అమ్మకు చెప్పకుండా ఏ పని చేయను’ అంటూ తన తల్లిపై తన ప్రేమను మరింత వివరించారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
