Site icon NTV Telugu

Sreeleela : ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..

Sreelela (2)

Sreelela (2)

తెలుగు చిత్ర పరిశ్రమలో స్పీడ్‌గా ఎదుగుతున్న యాక్ట్రెస్‌ శ్రీలీల. గ్లామర్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్‌, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. భాషతో సంబందం లేకుండా ఈ బ్యూటీ వరుస ప్రజెక్ట్‌లతో ధూసుకుపొతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై ప్లాన్లు, ప్రేమ వార్తలపై ఓపెన్‌గా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ కుండ బద్దలు కొటేసింది..

Also Read : War 2 & Coolie : నార్త్‌లో వార్ 2కి.. ‘కూలీ’ గట్టి షాక్..!

శ్రీలీల మాట్లాడుతూ ‘ఇప్పుడు నా వయసు 24 సంవత్సరాలు మాత్రమే. కెరీర్ స్టేజీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలనేది అసలు ఆలోచన లేదు. ప్రస్తుతం పూర్తిగా సినిమాల పై ఫోకస్ చేస్తున్నా, ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించేందుకు టైం లేదు. నిజంగా నేను ఎవరితోనైనా రిలేషన్‌లో ఉంటే, మాతో మా అమ్మ ఉండగలదా? నేను ఎక్కడికెళ్లినా మా అమ్మనే నా వెంట ఉంటుంది. అమెరికా వెళ్లినప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరితో ప్రేమలో పడగలను?.. ప్రస్తుతం నాకు కెరీర్‌దే ఫస్ట్ ప్రైయారిటీ. పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల మద్దతు పొందడం కోసం కష్టపడుతున్నాను’ అని చెప్పారు శ్రీ లీల. ఆమె మాటలు విని అభిమానులు ‘‘ఎంత ఫేమస్ అయినా మామ్స్‌ బేబీగానే ఉంది’’ అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అలాగే మీడియాలో వచ్చే గాసిప్స్‌కి తాను అటెంప్ట్ ఇవ్వకుండా ఉంటానని కూడా చెప్పారు శ్రీ లీల.

Exit mobile version