Site icon NTV Telugu

Sreeleela : పెళ్లి విషయంలో శ్రీలీల ఓపెన్‌ కామెంట్‌

Sreelela

Sreelela

అనతి కాలంలోనే టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌గా ఎదుగిన శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా త‌నకు నచ్చిన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన దారిలో ముందుకు సాగుతోంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే, ఆమె కెరీర్‌ మరో స్థాయికి చేరుకుంటుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న “మాస్ జాతర” చిత్రంలో కూడా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీ లీల తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో తరచూ పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన కాబోయే భర్తలో కావాల్సిన లక్షణాలు గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది.

Also Read: Prabhas : ‘ఫౌజీ’తో తెలుగులోకి అడుగుపెడుతున్న కన్నడ బ్యూటీ..

“నాకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, నన్ను అర్థం చేసుకునే మనసున్న వ్యక్తి కావాలి. నా సినీ కెరీర్‌ పట్ల గౌరవంగా ఉండి, ప్రేమతో నన్ను ప్రోత్సహించి, సరదాగా ఉండే, నిజాయితీ గల వ్యక్తి నా జీవితం లోకి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా” అని స్పష్టం చేసింది శ్రీ లీల. అదే సమయంలో తాను ఇటీవల కొంతమంది దర్శకుల ఆఫర్లను తిరస్కరించడం వెనుక కారణం గురించి కూడా వివరించింది. “కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నా. అలాంటి మంచి పాత్ర దొరికితే ఎలాంటి సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ చెప్పింది.

ప్రజంట్ శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమె నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు. కొందరు “ఇది ప్రేమలో ఉన్న సంకేతమేమో?” అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా, తన స్పష్టమైన ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో, నిజాయితీతో మాట్లాడే శ్రీ లీల మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కెరీర్‌లో ఒక్కో అడుగు ముందుకేస్తూ, స్క్రీన్‌పైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న ఈ యంగ్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్టాపిక్‌గా మారింది.

Exit mobile version