Site icon NTV Telugu

Sree Leela: శ్రీ లీల… మైండ్ బ్లాకయ్యే రెమ్యూనరేషన్ డిమాండ్?

Sree Leela

Sree Leela

పెళ్లి సందD సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన శ్రీలీల ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం పడలేదు. ఎందుకంటే ఆమెకు వరుస సినీ అవకాశాలు అలా వచ్చి పడ్డాయి. నిజానికి ఆమెకు ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో అన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె డిమాండ్ మాత్రం తగ్గడం లేదు, సరికదా ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇప్పటికే ఆమె రెమ్యూనరేషన్ చాలాసార్లు పెంచింది.

Also Read:The Paradise: ధగడ్ పని మొదలెట్టాడు!

తాజాగా బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నందున ఆమె ఇప్పుడు మరోసారి రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు శ్రీలీల ఏకంగా ఏడు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా హీరోయిన్‌కి రెమ్యూనరేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి. అయితే బాలీవుడ్ నిర్మాతలు శ్రీలీలకు ఆ మొత్తం ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రెమ్యూనరేషన్ భారీగా పెంచింది. అయితే ఆమెకు 7 కోట్లు ఇవ్వడానికి తెలుగు నిర్మాతలు ప్రస్తుతానికి సిద్ధంగా లేరు.

Also Read:The Family Man 3 : ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గ్లింప్స్ రిలీజ్..!

అందుతున్న సమాచారం మేరకు ఆమె ఇప్పటివరకు రెండున్నర కోట్లు ఒక్కో తెలుగు సినిమాకి తీసుకునేది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం మూడు కోట్లు తీసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి కదా అని, డబ్బులు డిమాండ్ చేసి ఏకంగా ఏడు కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా నుంచి బయటకు వెళ్లిపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే అని అంటున్నారు.

Exit mobile version