Site icon NTV Telugu

Sreeleela : శ్రీ లీల బర్త్ డే స్పెషల్.. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్

Sreeleela

Sreeleela

ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది శ్రీలీల. అనతి కాలంలోనే తన అందం, అభినయం, ఎనర్జీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నేడు (జూన్ 14) తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి బ్యాక్ టూ బ్యాక్ స్పెషల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో ఆమె గ్లామర్‌తో పాటు డ్రస్సింగ్ స్టైల్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక అలాగే..

మరోవైపు మాస్ రాజా రవితేజ ‘మాస్ జాతార’ మూవీ నుంచి కూడా బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఇందులో శ్రీలీల మరోసారి ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేనప్పటికీ, పోస్టర్ చూస్తేనే ఆమె పాత్ర పట్ల ఆసక్తి పెరిగింది. ఇక ఈ రెండు పోస్టర్లు బర్త్‌డే సందర్భంగా విడుదల కావడంతో శ్రీ లీల అభిమానులు సోషల్ మీడియాలో భారీగా పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా శ్రీలీల  కెరీర్‌లో  చిత్రాలు మరో మైలురాయిగా నిలవనున్నాయి.

Exit mobile version