తన ఎనర్జిటిక్ డాన్స్, సహజమైన నటనతో, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న.. అందాల భామ శ్రీలీల. ఇటు తెలుగు తో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్తిక్ ఆర్యన్‌తో హిందీలో ఒక ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన ఆమె తాజాగా మరో బిగ్ బాలీవుడ్ సినిమా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రణ్‌వీర్ సింగ్ – బాబీ దేవోల్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్ రూపొందుతుంది.
Also Read : HHVM : నిధి ఆన్ ప్రమోషన్స్ డ్యూటీ!
ఈ చిత్రానికి కథానాయికగా శ్రీ లీలను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రణ్‌వీర్, బాబీ దేవోల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక వర్క్‌ను ప్రారంభించారని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని బీటౌన్ టాక్. తెలుగులో ‘జూనియర్’ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్‌పైకి వచ్చిన శ్రీలీల ఇప్పుడు ఇతర భాషల్లో కూడా తన టాలెంట్‌ను చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన చోటు సంపాదించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్ పై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగిపోగా.. రణ్‌వీర్‌కి జోడీగా శ్రీలీల ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి!
