Daredevil: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన హవా చాటుకుంటోంది. వరుసగా అక్కడి స్టార్ హీరోల సినిమాలతో బిజీగా మారిపోయిన ఈ అమ్మడు, తాజాగా తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ (#DareDevil) షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో తాను జాయిన్ అవ్వబోతున్నట్లు చెప్పి అజిత్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది.
ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజిత్ కుమార్, షాలిని దంపతులపై తనకున్న అభిమానాన్ని శ్రీలీల బయటపెట్టింది. “‘డేర్ డెవిల్’ కథ విని చాలా రోజులైంది. ఎట్టకేలకు రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి మా అమ్మకు షాలిని మేడమ్ అంటే విపరీతమైన అభిమానం. అప్పట్లో అజిత్ సార్, షాలిని మేడమ్ కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆ టైమ్‌లో వారిద్దరూ ఇండస్ట్రీకి ‘గోల్డెన్ డక్స్’ లాంటి వారు” అంటూ ఆ జంటకున్న క్రేజ్‌ను శ్రీలీల గుర్తుచేసుకుంది.
ఈ సినిమాకు అజిత్, షాలిని దంపతులు నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. పూజా కార్యక్రమంలో వారు చూపించిన ఆప్యాయతను శ్రీలీల ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది. “వారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ కూడా. రీసెంట్గా జరిగిన పూజా కార్యక్రమంలో అజిత్ సార్, షాలిని మేడమ్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అక్కడికి వచ్చిన వాళ్లంతా భోజనం చేశారా లేదా అని దగ్గరుండి మరీ చూసుకున్నారు. వారి మంచితనం నాకు బాగా నచ్చింది. రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను” అని శ్రీలీల చెప్పుకొచ్చింది. తెలుగులో తన డ్యాన్స్, ఎనర్జీతో యూత్‌ను ఆకట్టుకున్న శ్రీలీల.. ఇప్పుడు అజిత్ కుమార్ లాంటి స్టార్ హీరోతో జతకట్టడంతో ‘డేర్ డెవిల్’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

