Vishnu Vinyasam: విష్ణు విన్యాసం చేయనున్న శ్రీవిష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ (ఎస్ఎస్సి) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన స్టైలిష్ యానిమేటెడ్ గ్లింప్స్ ద్వారా ఈ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచింది. అర్బన్ సెటప్‌లో సాగిన ఈ యానిమేటెడ్ ఫుటేజ్‌లో, కస్టమ్ పసుపు రంగు మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకుపోతున్న శ్రీ విష్ణు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఆకట్టుకున్నాడు.
Also Read:Funky : ముందుకొచ్చిన ‘ఫంకీ’.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
- The Traitors Telugu :'చీప్.. మిడిల్ క్లాస్'.. వర్ష'పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
- Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
- Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్ హీరో శ్రీ విష్ణు విచిత్రమైన, ఆహ్లాదకరమైన తెరపై పాత్రకు అద్దం పట్టేలా ఉంది. ఆయన ట్రేడ్‌మార్క్ హ్యూమర్‌ను హైలైట్ చేస్తూ, టైటిల్ రివీల్‌కు “No Brakes – Just Laughs” (బ్రేకులు లేవు – కేవలం నవ్వులే) అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ను జతచేయడం మరింత ఆకర్షణీయంగా ఉంది. “చరిత్ర, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయి” అంటూ వినిపించిన ప్లేఫుల్ వాయిస్ఓవర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. రధన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మొత్తం టైటిల్ వీడియోకి హాస్యాన్ని మరింత పెంచింది.
Also Read:Annagaru Vostaru : కార్తీ సినిమాకి కొత్త టెన్షన్?
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేమ & షాలిని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు, సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ యూనిక్ ఎంటర్టైనర్లో నయన సారిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నవ్వులు పండించడానికి భారీ తారాగణం ఉంది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!