Telugu Actor: వెండితెరపై విభిన్నమైన కథలతో, న్యాచురల్ యాక్టింగ్‌తో, తనదైన కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే ఆయన టాలెంట్‌ను మనం స్క్రీన్‌పై చూశాం. కానీ ఆయన లైఫ్‌లో చాలామందికి తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఉంది. సినిమాల్లోకి రాకముందు ఆయనో ప్రొఫెషనల్ క్రికెటర్. అందరిలాగా గల్లీ క్రికెట్ ఆడి ఆపేయలేదు.. ఏకంగా అండర్-19 స్టేట్ టీమ్‌కు ఎంపికై లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్‌గా ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చిన్నతనం గోదావరి జిల్లాలైన అమలాపురం, భీమవరం పరిసరాల్లో గడిచిందని చెప్పారు. అప్పట్లో బ్యాట్లు కొనుక్కునే పరిస్థితి లేక కొబ్బరి మట్టలను బ్యాట్‌లా చెక్కుకుని రబ్బరు బాల్‌తో క్రికెట్ ఆడేవారిమని గుర్తు చేసుకున్నారు.
‘స్కూల్ రోజుల్లో కార్క్ బాల్, గ్రేస్ బాల్స్‌తో మ్యాచ్‌లు ఉండేవి, టీమ్ మొత్తానికి ఒకే ఒక్క కిట్ ఉండేది. బ్యాటింగ్‌కు వెళ్లేవాడు ఒక ప్యాడ్ కట్టుకుంటే, రన్నర్‌కు ఇంకో ప్యాడ్ ఇచ్చేవాడు. ఇలా ఒకడు వాడిన ప్యాడ్లనే ఇంకొకడు మార్చుకుంటూ మ్యాచ్‌లు ఆడిన పరిస్థితుల నుంచి తన ప్రయాణం మొదలైందన్నారు. తాను పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్‌తోనే చేస్తాను, కానీ బ్యాటింగ్ మాత్రం రైట్ హ్యాండ్‌తో చేస్తానన్నారు. బౌలింగ్‌లో మాత్రం తనకు పుట్టుకతోనే ఒక సహజమైన లెఫ్టార్మ్ స్వింగ్ ఉండేదనన్నారు. 90ల కాలంలో హైదరాబాద్ శీతాకాలపు చలి, మంచు వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ బంతిని ఎలా స్వింగ్ చేయాలో స్వయంగా నేర్చుకున్నాను. పాకిస్థాన్ స్వింగ్ సుల్తాన్ వసీమ్ అక్రమ్, శ్రీలంక స్టార్ చమిందా వాస్ బౌలింగ్ యాక్షన్లను నిశితంగా గమనిస్తూ ఇన్-స్వింగ్, అవుట్-స్వింగ్‌లపై పట్టు సాధించాను’ అని చెప్పారు.
ఈ రోజుల్లోలాగా అప్పట్లో ఊరూరా క్రికెట్ అకాడమీలు, నెట్స్ ఉండేవి కావు. బౌలింగ్‌లో స్పీడ్ పెంచుకోవడం కోసం సిమెంట్ పిచ్‌పై టెన్నిస్ బాల్‌ను నీళ్లలో తడిపి మరీ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవారు. భీమవరంలో చదువుతున్నప్పుడు స్కూల్ తరఫున జోనల్ టోర్నమెంట్లు ఆడటం, ఆ తర్వాత ఏలూరు, కాకినాడల్లో జిల్లా స్థాయి సెలక్షన్లలో రాణించడంతో ఆయన టాలెంట్ బయటపడింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టేట్ అండర్-19 జట్టులో లెఫ్టార్మ్ పేసర్‌గా చోటు దక్కించుకున్నట్లు వెల్లడించారు. 90లలో దేశమంతా సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు వెర్రి అభిమానులుగా మారితే, శ్రీవిష్ణు మాత్రం ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్‌కు వీరాభిమానిగా మారారు. ప్రతి బంతినీ బాదేయడం కాకుండా, బంతికి గౌరవం ఇవ్వడం, క్రీజులో ప్రశాంతంగా నిలబడే ద్రవిడ్ మైండ్‌సెట్ ఆయనను బాగా ఆకర్షించిందన్నారు. దాంతోపాటు వివిఎస్ లక్ష్మణ్ త్రిబుల్ సెంచరీ వార్తలు, ఎంఎస్‌కే ప్రసాద్ ఆటను పేపర్లలో ఎంతో ఆసక్తిగా ఫాలో అయ్యేవాడినని చెప్పారు. ఒకానొక దశలో క్రికెట్‌నే కెరీర్‌గా మార్చుకోవాలనుకున్న శ్రీవిష్ణు, పరిస్థితుల ప్రభావంతో నటన వైపు అడుగులు వేసినట్లు గుర్తు చేసుకున్నారు.

