NTV Telugu Site icon

Ram Marriage: రామ్ పెళ్లి వార్త పుకారే.. అసలు విషయం చెప్పిన స్రవంతి రవికిషోర్!

Ram Pothineni Marriage News

Ram Pothineni Marriage News

Sravanthi Ravikishore Clarity on Ram’s wedding reports: ఈ మధ్యకాలంలో వరుసగా హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని కూడా వివాహం చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతానికి రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇంకా పేరు ఫిక్స్ చేయని ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ఏడాదిలో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది. హైదరాబాదుకు చెందిన ఒక బిజినెస్ మాన్ కూతురిని రామ్ వివాహం చేసుకోబోతున్నాడని ఇప్పటికే ఇరువైపులా అందరికీ అంగీకారం కుదరడంతో ఈ ఏడాది చివరిలోపు ఆయన వివాహం జరుగుతుంది అంటూ వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే ఈ విషయం మీద రామ్ తరఫునుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఆయనకు నిజంగా వివాహం ఫిక్స్ అయిందేమో అని అందరూ అనుకున్నారు, అయితే తాజాగా ఈ ప్రచారం అంతా ఒట్టిదేనని తెలుస్తోంది.

Anasuya Bhradwaj: బికినీ ఫోటోలు షేర్ చేసిన అనసూయ.. మిస్ అవ్వకూడదంట!

ఈ విషయం మీద ఒక మీడియా పోర్టల్ తో స్రవంతి రవి కిషోర్ స్పందించారు. స్రవంతి రవి కిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన రామ్ కు బాబాయ్ అవుతారు. ఈ క్రమంలో స్రవంతి రవి కిషోర్ స్పందిస్తూ అసలు ఈ వార్తలన్నీ నాన్సెన్స్ అంటూ కొట్టిపడేశారు. ఒక వేళ నిజంగానే సంబంధం సెట్ అయ్యి పెళ్లి ఫిక్స్ అయితే అది దాయాల్సిన అవసరం తమకేం ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త కూడా నిజం కాదని ఇంకా పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి రామ్ చివరిగా ది వారియర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. మళ్ళీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రామ్ పోతినేని సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు గోల్డెన్ లెగ్ అనే ముద్ర పడడంతో ఖచ్చితంగా తమ సినిమా హిట్ అని భావిస్తున్నారు రామ్ అభిమానులు.