Site icon NTV Telugu

“ఎస్ఆర్ కళ్యాణమండపం” సెన్సార్ పూర్తి

SR Kalyana mandapam gets U/A

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా ప్రముఖ పాత్రలో నటించారు.

Read Also : కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ!

సహాయక పాత్రల్లో తానికెళ్ల భరణి, అరుణ్, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్, భరత్, కిట్టయ్య నటించారు. ఈ చిత్రాన్ని శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తుండగా, ప్రమోద్, ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజు నిర్మిస్తున్నారు. సినిమా డీఓపీ విశ్వాస్ డేనియల్, ఎడిటర్ శ్రీధర్ గాదె ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీత స్వరకర్త. ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Exit mobile version