పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు . గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ “కల్కి 2898 ఏడి” సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా విడుదల కానుంది .అలాగే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.త్వరలోనే ఈమూవీ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు .ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ది రాజాసాబ్”.టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మారుతీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..
ఈ సినిమాలో ప్రభాస్ ఓ స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నట్లు సమాచారం.ఈ పాటలో ప్రభాస్ ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ ముగ్గురూ ఒకే పాటలో ప్రభాస్‌తో స్టెప్పులేయనున్నట్లు సమాచారం.ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే డాన్స్ మూమెంట్స్‌తో ఈ పాట ఉండనుందని సమాచారం.హరర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ చేస్తున్న తొలి మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి . ‘ప్రేమకథా చిత్రం’ తరహాలో హారర్‌తో పాటు అద్భుతమైన కామెడీ కూడా ఇందులో ఉంటుందని సమాచారం. వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు బోర్ కొట్టడంతో దర్శకుడు మారుతితో ఓ కామెడీ జోనర్ మూవీలో నటించాలని అనుకున్నాడు .అందుకు తగ్గట్టుగానే మారుతీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది