Site icon NTV Telugu

“F9” థియేటర్లలో “జురాసిక్ వరల్డ్ డొమినియన్” ప్రివ్యూ

Special Extended Preview of Jurassic World Dominion to be screened Only in IMAX along with F9

జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం “జురాసిక్ వరల్డ్: డొమినియన్”. చిత్ర నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జురాసిక్ వరల్డ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ థ్రిల్లర్ మూవీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే… యాక్షన్ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9” (F9) మూవీని ప్రదర్శించబోయే ఐమాక్స్ థియేటర్లలో “జురాసిక్ వరల్డ్: డొమినియన్” సినిమాకు సంబంధించి ఐదు నిమిషాల ప్రివ్యూ వేయబోతున్నారట. కేవలం ‘F9’ను ప్రదర్శించబోయే ఐమాక్స్ థియేటర్లలోనే ఈ ప్రివ్యూ ఉండనుంది.

Read Also : తలపతి విజయ్ కు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్

“వచ్చే వేసవిలో డైనోసార్‌లు భూమిని శాసిస్తాయి. ఈ శుక్రవారం (జూన్ 25) # F9 IMAX స్క్రీనింగ్‌లో ఒక స్నీక్ పీక్ ను వీక్షించండి” అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియో చూస్తుంటే ఈ చిత్రం 65 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల కొత్త జాతులకు సంబంధించి ఉండబోతున్నట్టు స్పష్టం అవుతోంది. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. “జురాసిక్ వరల్డ్ : డొమినియన్”కు కోలిన్ ట్రెవరో దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లాస్ హోవార్డ్… ఓవెన్ గ్రేడి, క్లైర్ డియరింగ్ అనే పాత్రల్లోనే మళ్ళీ కనిపించనున్నారు. ఈ చిత్రం 2022 జూన్ 10న ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది.

Exit mobile version