సిల్క్ స్మిత ఈ పేరు తెలియని సౌత్ సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.విజయలక్ష్మి గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సిల్క్ స్మితగా పేరు మార్చుకుని ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు తమిళ్,మలయాళం, కన్నడ ఇండస్ట్రీలలో ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో సిల్క్ పాత లేనిదే స్టార్ హీరోల సినిమాలు సైతం విడుదల అయ్యేవి కావు.
Also Read : Actress Shobhita : నటి శోభిత ఆత్మహత్యకేసులో కీలక మలుపు
నేడు లెజెండరీ నటి సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా STRI సినిమాస్ నిర్మిస్తున్న సినిమా “సిల్క్ స్మిత – క్వీన్ ఆఫ్ ద సౌత్” అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ను ప్రకటించారు మేకర్స్. వెండితేర రాణి సిల్క్ స్మిత అఫీషయల్ బయోపిక్ గాఈ సినిమా రానుంది . ఈ సిల్క్ పాత్రలో నటి చంద్రిక రవి టైటిల్ రోల్‌లో నటిస్తోంది. జయరామ్ శంకరన్ దర్శకత్వం వహిస్తుండగా SB.విజయ్ అమృతరాజ్ నిర్మించిన ఈ చిత్రం 2025 షూటింగ్ స్టార్ట్ కానుంది. గతేడాది ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ లభించింది. నేడు సిల్క్ స్మిత సౌత్ క్వీన్ గురించి ప్రేక్షకులకు మరొక సారి గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. సిల్క్ పాత్రలో చంద్రిక రవి పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పాలి. వచ్చే ఏడాదినుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. గతంలో విద్యా బాలన్ లీడ్ రోల్ లో సిల్క్ స్మిత బయోపిక్ పేరుతో ‘ డర్టీ పిచ్చర్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.