NTV Telugu Site icon

Mohan Babu – Soundarya: మోహన్ బాబు తప్పేం లేదు.. సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు

Mohan Babu

Mohan Babu

అనూహ్యంగా గత కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు పేరు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నటి సౌందర్యది ప్రమాదం కాదని ఆమెను ప్లాన్ చేసి చంపి ఉంటారని అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. అంతే కాదు జల్పల్లికి చెందిన ఫామ్ హౌస్ ని కూడా అదుపులో ఉంచుకుని మోహన్ బాబే అనుభవిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు. గత కొద్దిరోజులుగా హైదరాబాదులోని ఒక ప్రాపర్టీ కి సంబంధించి మోహన్ బాబు సౌందర్య పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. ప్రాపర్టీ గురించి ఇవన్నీ ఆధారాలు లేని వార్తలే. నా భార్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు ఇల్లీగల్గా స్వాధీనం చేసుకోలేదు.

Ranya Rao: మనశ్శాంతి కరవైంది.. నిద్రలేదు.. కోర్టుకు రన్యారావు వినతి

నాకు తెలిసినంతవరకు ఆయనకు, మాకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు కూడా లేవు. సౌందర్య మరణించిన తర్వాత కూడా నాకు మోహన్ బాబు గారితో 25 సంవత్సరాల పైనుంచి మంచి స్నేహం ఉంది. నా భార్య, అత్తగారు, బావమరిది ఎప్పుడూ ఆయనతో మంచిగా ఉండేవారు. ఈ విషయంలో నేను ఆయనకు అండగా నిలుస్తూ అసలు విషయం ఏంటో చెప్పాలనుకున్నాను. మాకు మోహన్ బాబు కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవు ఇవి కచ్చితంగా ఆధారం లేని వార్తలే. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ ప్రచురించకండి అంటూ ఆయన ఒక లేఖ విడుదల చేశారు. సౌందర్య మరణానికి ముందు రఘు జిఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఆమె కన్నుమూశారు.