NTV Telugu Site icon

ఆక్సిజన్ కోసం సోనూసూద్ కీలక నిర్ణయం

Sonusood

రీల్ నటుడు సోనూసూద్ కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో పేదలకు ఎంతో సహాయం చేసి రియల్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన చేసిన సహాయక చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అయితే తాజాగా సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 16-18 రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, కర్నూలు జిల్లలో రెండు ప్రదేశాలు లాక్ చేయడంతో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, జూన్ నాటికి అక్కడ ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సెప్టెంబర్ నాటికి అన్ని రాష్ట్రాల్లో పూర్తవుతుంది. ఈ విషయం గురించి సోనూసూద్ మాట్లాడుతూ “నేను అన్ని రాష్ట్రాలను కవర్ చేయడానికి ప్రయత్నించాను. దాదాపు 150-200 పడకలు ఉండే అవసరమైన ఆస్పత్రుల దగ్గర ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ ఆసుపత్రులన్నిటికీ ఆక్సిజన్ కొరత ఉండదు. కొన్నిసార్లు ఆసుపత్రులను చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించడం రోగులు తమ ప్రాణాలను కూడా కోల్పోతారు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయంతో అలాంటి పరిస్థితి ఎప్పటికీ తలెత్తదని నేను నమ్ముతున్నాను. మూడవ లేదా నాల్గవ వేవ్ కోసం ఎందుకు వేచి ఉండాలి మహమ్మారి ఎఫెక్ట్ తగ్గిన తరువాత కూడా సమీప గ్రామాలు జిల్లాలకు ఎప్పటికీ ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. ప్రజలకు సహాయపడటం తనకు మరింత బాధ్యతగా అనిపిస్తుందని” ఆయన చెప్పారు. ఇంకా సహాయం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని, వారికి చేతనైన సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుందని కోరారు సోనూసూద్. కోవిడ్ -19 బారిన పడ్డ ప్రజలకు సహాయం చేయడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న నటుడు సోను సూద్ తెలుగు చిత్రం “ఆచార్య”, బాలీవుడ్ చిత్రం “పృథ్వీరాజ్”లో త్వరలో నటిస్తున్నాడు.