Site icon NTV Telugu

సోనూ సూద్ కు కరోనా నెగెటివ్!

Sonu sood tests Negative for Covid-19

సోనూ సూద్ అభిమానులందరికీ ఓ శుభవార్త. తాజాగా జరిపిన కోవిడ్ 19 పరీక్షలలో తనకు నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని సోనూ సూద్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. నిజానికి కొద్ది రోజుల ముందు సోనూసూద్ కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అనే రిపోర్ట్ రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న సోనూ అభిమానులు కోట్లాది మంది ఆవేదన చెందారు. కొందరైతే ‘దేవుడికి కూడా కరోనా వస్తుందా?’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గత యేడాది లాక్ డౌన్ టైమ్ నుండి ఇప్పటికీ ఆపన్నులను ఆదుకోవడంలో సోనూసూద్ ముందు ఉంటున్నారు. ఆయన ఎంతమందికి సాయం చేస్తున్నా… ఇంకా ఎంతో మంది సాయం పొందాల్సిన వాళ్ళు మిగిలిపోతూనే ఉన్నారు. అయినా కూడా సోనూసూద్ తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు… ఏదో ఫలానా సాయం అని బరి గీసి కూర్చోకుండా ఎన్ని విధాలుగా బాధితులకు సేవ చేయాలో అన్ని విధాలుగా సోనూ చేస్తుండటం విశేషం. ఇప్పుడు సోనూ సూద్ కు కరోనా నెగెటివ్ వచ్చిందనే వార్త తెలిసి దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకోవడం ఖాయం.

Exit mobile version