కరోనా కష్ట కాలంలో రియల్ హీరో సోనూసూద్ ఎంతోమంది ప్రాణాలను కాపాడి వారి పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో మెరుపు వేగంతో పని చేస్తున్నారు సోనూసూద్. డబ్బును కోట్లలో ఖర్చు పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. తాజాగా సోనూసూద్ సాయం అర్థించారు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్. ‘డియర్ సోనూసూద్ భాయ్… హైదరాబాద్ లో ఉన్న పొడుగు వెంకట రమణ అనే వ్యక్తికి ఒక ఇంజెక్షన్ టోసిలిజంబ్ 400 మి.గ్రా, 1 టాబ్ బారిసిటినిబ్ 4 ఎంజి, 3 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అత్యవసరంగా కావాలి. నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. సోనూసూద్ ఈజ్ ఓన్లీ హోప్” అంటూ సోను సాయాన్ని అర్థించాడు మెహర్ రమేష్. ఆయన ట్వీట్ కు స్పందించిన మెహర్ రమేష్ మీరు అడిగిన ప్రతి మెడిసిన్ అందుతుంది బ్రదర్. ప్రాణాలను కాపాడుకుందాం” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు రిప్లై ఇచ్చిన కొన్ని గంటల్లోనే మెహర్ రమేష్ అడిగిన అన్ని మెడిసిన్లు సదరు కరోనా రోగికి అందాయి కూడా. ఈ విషయాన్ని తెలియజేస్తూ సూపర్ హ్యూమన్, భూమికి గాడ్ బ్రదర్ అంటూ సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపించారు మెహర్ రమేష్.
సోనూసూద్ ఈజ్ ఓన్లీ హోప్… మెహర్ రమేష్ కు అందిన సాయం
