Site icon NTV Telugu

కోవిడ్ రోగిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూసూద్!

Sonu Sood airlifts Covid-19 patient from Nagpur to Hyderabad

కొవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి ఊపిరితిత్తులు దాదాపు 85-90 శాతం దెబ్బతిన్నాయి. సోనూసూద్ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రి డాక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ఇ.సి.ఎం.ఓ. శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు వారు సోనూసూద్ కు తెలిపారు. ఈ చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ లో భారతిని హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆమె ప్రస్తుతం ఉత్తమమైన చికిత్సను పొందుతోంది. ఈ విషయం గురించి సోనూసూద్ మాట్లాడుతూ, “అవకాశాలు 20శాతం మాత్రమే అని వైద్యులు అన్నారు. కానీ భారతి 25 ఏళ్ల యువతి, అందుకే మేం ఈ అవకాశాన్ని తీసుకున్నాం, వెంటనే ఎయిర్ అంబులెన్సు బుక్ చేశాం. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది” అని అన్నారు. విశేషం ఏమంటే… సోనూసూద్ కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో హోమ్ క్వారంటైన్ లో ఉంటూనే ఈ రియల్ హీరో ఈ పనులన్నీ చేస్తున్నాడు.

Exit mobile version