NTV Telugu Site icon

Jatadhara : ‘జటాధర’ షూటింగ్‌పై సోనాక్షి అప్డేట్

Jatadhara

Jatadhara

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ బిగినింగ్‌లో చిన్న పాత్రల్లో మెరిసిన సుధీర్ బాబు, ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికి ఎక్కడ తగ్గకుండా కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. ఇక తాజాగా ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వ‌హిస్తున్నఈ ప్రాజెక్ట్‌‌లో క‌థానాయిక‌గా బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హా న‌టిస్తోంది.

మైథాలాజిక‌ల్, సూప‌ర్ న్యాచుర‌ల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీల‌క పాత్రల్లో న‌టిస్తుండ‌గా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్‌ కె.ఆర్‌.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీతో మొదటిసారిగా తెలుగులో అడుగుపెడుతుంది సోనాక్షి. తన పాత్ర కొత్తగా ఉండబోతున్నట్లు  ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధం అవుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘జటాధర’ మూవీ షూటింగ్ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.. ‘ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది.ఇలాంటి చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇందులో నా పాత్ర మీమల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నాను. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను..’ అని తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.