Site icon NTV Telugu

Sobhita Dhulipala : ప్రతి అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ ‘బ్యాడ్ గర్ల్’ను ప్రశంసించిన శోభితా

Badgirl Shobitha

Badgirl Shobitha

గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా వరకు సాధారణ స్పందనే తెచ్చుకున్న, ఒక సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఎందుకు ‘బ్యాడ్ గర్ల్’ గా మారింది? ఆమె జీవితం ఎలా మలుపు తీసుకుంది? అనే కథతో సినిమా సాగుతుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించగా, వర్ష భరత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరోయిన్ అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా, శరణ్య రవిచంద్రన్ మరో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని కొందరు ఆరోపించడంతో సినిమా థియేటర్లకు రాకముందే పెద్ద వివాదం రేగింది. చివరకు సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలకు కట్‌లు పెట్టి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : Chinmayi : తప్పుచేసి సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరొకసారి జానీ మాస్టర్‌పై విరుచుకుపడ్డ చిన్మయి

ఇక ఈ మూవీని తాజాగా నటిని శోభితా ధూళిపాళ కూడా చూసి బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసింది.. “ఈ సినిమా నన్ను నవ్వించింది, ఏడిపించింది. చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ప్రతి అమ్మాయి తప్పకుండా ఈ సినిమాను చూడాలి. ఇది మన కోసం తీసిన సినిమా. వర్ష భరత్ గారికి, అంజలి శివరామన్‌కి హృదయపూర్వక అభినందనలు” అని తెలిపింది. అంటే శోభితా ఈ సినిమాను చాలా ఇష్టపడిందని అర్థమవుతోంది.

Exit mobile version