Site icon NTV Telugu

Akhanda 2: ‘అఖండ 2’ ఎఫెక్ట్‌తో మారిన సినిమాల ఫైనల్ రిలీజ్ డేట్‌లివే!

Akhanda Vs Cinemas

Akhanda Vs Cinemas

సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమా విడుదల తేదీ మారితే, దాని ప్రభావం ఆ చుట్టుపక్కల తేదీల్లో రిలీజ్ కావాల్సిన చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలపై తీవ్రంగా పడుతుంది. చిన్న సినిమాల కష్టాలు వర్ణనాతీతం. మరో సరైన రిలీజ్ డేట్ దొరక్క, బాక్సాఫీస్ పోటీని తట్టుకోలేక అవి ఇబ్బందులు ఎదుర్కొంటాయి. డిసెంబర్ 5న రావాల్సిన ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12కు వాయిదా పడటంతో, అదే రోజు విడుదల కావాల్సిన చిన్న చిత్రాలన్నీ తమ విడుదల తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాలు ఏ తేదీలకు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

Also Read :Dimple hayathi : వేడి వేడి అందాలతో చలికి సెగలు తెప్పిస్తున్న డింపుల్ హయతి

1.రోషన్ కనకాల ‘మోగ్లీ’: బబుల్‌గమ్ తర్వాత హిట్ కోసం

రావాల్సింది: డిసెంబర్ 12
ఎప్పుడు వస్తోంది: డిసెంబర్ 13 (అయితే, డిసెంబర్ 12 రాత్రి ప్రీమియర్స్ వేస్తున్నారు)

సుమ, రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమైన ‘బబుల్‌గమ్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే, రోషన్‌కు ఈ ‘మోగ్లీ’ చిత్రం హిట్ కావడం చాలా అవసరం. ఈ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్న ‘కలర్‌ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. కరోనా సమయంలో వచ్చిన ‘కలర్‌ఫోటో’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ‘అఖండ 2’ ఎంట్రీతో ‘మోగ్లీ’ రిలీజ్ డేట్‌ను మార్చక తప్పలేదు. తర్వాతి వారం అంటే డిసెంబర్ 19న వద్దామంటే.. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ‘అవతార్ 3’ విడుదలవుతోంది. ఇక క్రిస్మస్ (డిసెంబర్ 25)కు వచ్చే ఛాన్స్ అస్సలు లేదు, ఎందుకంటే అప్పటికే దాదాపు 10 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందుకే 12వ తేదీని ‘అఖండ 2’కు వదిలేసి, ఒక రోజు తేడాతో డిసెంబర్ 13న ‘మోగ్లీ’ని విడుదల చేయాలని నిర్ణయించారు.

2. హారర్ థ్రిల్లర్ ‘ఈషా’: క్రిస్మస్ హాలిడేస్ లక్ష్యంగా

నిజంగా రావాల్సింది: డిసెంబర్ 12
ఎప్పుడు వస్తోంది: డిసెంబర్ 25

‘ఆత్మలు ఉన్నాయా? లేవా?’ అనే కాన్సెప్ట్‌తో టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకులను భయపెట్టి, కొంత హైప్‌ను క్రియేట్ చేసుకుంది హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. ‘అఖండ 2’తో పోటీపడకుండా, క్రిస్మస్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఏకంగా క్రిస్మస్ రోజు, అంటే డిసెంబర్ 25కు మార్చుకుంది.

Also Read : Rhea Singha: కమెడియన్ సత్య సరసన మిస్ యూనివర్స్

3. నందు ‘సైక్ సిద్దార్థ్’: కొత్త సంవత్సరం స్వాగతం

* నిజంగా రావాల్సింది: డిసెంబర్ 12
* ఎప్పుడు వస్తోంది: జనవరి 1

రిలీజ్ డేట్ మార్చుకున్న మరో సినిమా ‘సైక్ సిద్దార్థ్’. నందు హీరోగా నటించిన ఈ సినిమాను సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. భారీ పోటీని తప్పించుకుని, న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేస్తే కలిసి వస్తుందని భావించి, జనవరి మొదటి తేదీకి వెళ్లిపోయింది. ఈ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ హీరో నందు, రానా దగ్గుబాటి కలిసి ఒక సరదా వీడియోను విడుదల చేయడం విశేషం.

4. కార్తీ ‘అన్నగారు వస్తారు’: వెనక్కి తగ్గని ఏకైక చిత్రం

డిసెంబర్ 12న విడుదల కావాల్సిన చిత్రాలలో మార్పు లేని ఏకైక సినిమా కార్తీ నటించిన తమిళ చిత్రం ‘అన్నగారు
వస్తారు’. ఇది తమిళ సినిమా కావడంతో, కార్తీకి తమిళ మార్కెట్ ముఖ్యం. అందుకే పెద్ద సినిమా వచ్చినా వెనక్కి తగ్గకుండా, ముందుగా నిర్ణయించిన తేదీకే రావడానికి మొగ్గు చూపింది.

Exit mobile version