Site icon NTV Telugu

Kollywood : రూ. 20 కోట్ల క్లబ్ లో చిన్న సినిమా

Tourist Family

Tourist Family

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ప్రజెంట్ హాట్ టాక్ ఆఫ్ ది కోలీవుడ్డే కాదు టాలీవుడ్‌గా మారింది టూరిస్ట్ ఫ్యామిలీ. సీనియర్ హీరో శశి కుమార్, సీనియర్ నటి సిమ్రాన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా శ్రీలంక నుండి శరణార్థి కుటుంబం చెన్నైకి చేరుకున్నాక ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా చేసుకుని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.  ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా జస్ట్ మౌత్ టాక్‌తో దూసుకెళుతోంది.

Also Read : Manchu Family : నేడు తిరుపతి కోర్టుకు మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్..

పాన్ ఇండియా సినిమా కాదు, భారీ బడ్జెట్ చిత్రం అంతకన్నా కాదు, పెద్ద స్టార్స్ లేరు కానీ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. పోటీలో కార్తిక్ సుబ్బరాజ్, సూర్య కాంబోలో వచ్చిన రెట్రో ఉన్న కూడా ఎక్కడా తగ్గకుండా ఆ సినిమాను మించి దూసుకెళ్తోంది టూరిస్ట్ ఫ్యామిలీ. కాగా ఈ సినిమా లేటెస్ట్ గా మరో మైల్ స్టోన్ మార్క్ ను అందుకుంది. కేవలం తమిళనాడు వ్యాప్తంగా మే 1రిలీజ్ అయిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తు వారం రోజుల్లోనే రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అటు బుక్ మై షో టికెట్స్ పరంగా ను అదరగొడుతూ 500K టికెట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ గా రెండవ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు అదనంగా మరో 85 థియేటర్స్ ను కేటాయించారు. ఈ వారం మారె ఇతర సినిమాలు లేకుండడంతో సాలిడ్ కల్కేక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Exit mobile version