NTV Telugu Site icon

Rekhachithram : మలయాళంలో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ

Rekha

Rekha

గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియన్ మూవీస్ దండయాత్ర చేసినా..ఐడెంటిటీ లాంటి సొంత ఇండస్ట్రీ స్టార్ హీరో మూవీస్ రేసులో ఉన్నప్పటికీ.. ఓ సినిమా మాత్రం మలయాళ బాక్సాఫీసు దగ్గర వసూళ్లు రాబట్టుకొంటుంది. చిన్న సినిమాగా వచ్చి.. ప్రభంజనం సృష్టిస్తోంది. జస్ట్ 6 కోట్లతో సినిమా తీస్తే.. ఇప్పటిదాకా 30 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంత పోటీలో కూడా కాసుల కురిపించుకుంటున్న ఆ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరోల్లో ఒకరైన ఆసిఫ్ అలీ నుండి 2025లో వచ్చిన ఫస్ట్ మూవీ రేఖా చిత్రం. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియన్ మూవీతో పాటు అప్పటికే రిలీజైన ఓన్ ఇండస్ట్రీ మూవీ ఐడెంటిటీ రేసులో ఉన్నప్పటికీ రిస్క్ చేసి జనవరి9న రిలీజ్ చేశారు మేకర్స్.

Tollywod: టాలీవుడ్ హీరోలను భయపెడుతోన్న కోలీవుడ్ డైరెక్టర్లు!

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాతో సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు జోఫిన్ టి చాకూ. ప్రీస్ట్ తో సక్సెస్ అయిన జోఫిన్ టి చాకూ సెకండ్ మూవీ రేఖా చిత్రంతో మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసిఫ్ అలీ, టాలెంటెడ్ యాక్ట్రెస్ అనశ్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జస్ట్ 6 కోట్లతో నిర్మించారు. రిలీజైన తరువాత సుమారు 30 కోట్లను వసూలు చేసింది. చిన్న సినిమా వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది ఫస్ట్ హిట్టు బొమ్మగా నిలిచింది. ఇక యాభై కోట్లను వసూలు చేస్తుందో లేదో వేచి చూడాలి.

Show comments