‘స్లమ్ డాగ్ మిలియనీర్’ బ్యూటీ ఫ్రిడా పింటో తల్లి కాబోతోంది! పెళ్లి కాలేదుగా అంటారా? ఎంగేజ్ మెంట్ అయితే అయిపోయింది! 2019 నవంబర్ లోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ కోరీ ట్రాన్ తో నిశ్చితార్థాన్ని సొషల్ మీడియాలో ప్రకటించింది. ఫోటోలు కూడా షేర్ చేసింది. అయితే, 2017 నుంచీ మన డస్కీ బ్యూటీని రొమాన్స్ చేస్తోన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ 2019 నుంచీ ఫ్రిడా ఫియాన్సెగా మీడియాలో, ఫ్యాన్స్ లో ఫేమస్ అయ్యాడు. అతడితో దిగిన ఫోటోల్ని తన సోదరి పెళ్లి సందర్భంగా మిస్ పింటో ఇన్ స్టాలో పోస్ట్ చేసింది!
చాలా రోజులుగా లివిన్ రిలేషన్ లో కొనసాగుతోన్న ఫ్రిడా, కోరీ ట్రాన్… తల్లిదండ్రులు కాబోతున్నట్టు తమ గుడ్ న్యూస్ ని… సోమవారం నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు. ‘బేబీ ట్రాన్, కమింగ్ దిస్ ఫాల్’ అని ఫ్రిడా క్యాప్షన్ ఇచ్చింది! అఫ్ కోర్స్… బేబీ బంప్ తో, బేబీ వాళ్ల డాడీతో… పింటో హ్యాపీగా ఫోజు కూడా ఇచ్చింది! ఇప్పుడు ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ బ్యూటీ మిలియన్ డాలర్ ప్రెగ్నెన్సీ ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది!
చూడాలి మరి, లవ్, ఎంగేజ్ మెంట్ తరువాత మ్యారేజ్ కి మిస్ కొట్టి డైరెక్ట్ గా మమ్మీ, డాడీ అయిపోయిన రొమాంటిక్ కపుల్… పాపో, బాబో పుట్టాక అన్న… పెళ్లాడతారో లేదో!