NTV Telugu Site icon

SK : శ్రీమతికి శివకార్తికేయన్ స్వీట్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్

Sk

Sk

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేసారు.

Also Read : Matka : దారుణంగా మెగా హీరో మట్కా ఓవర్సీస్ బుకింగ్స్

కాగా విడుదలై రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకలెక్షన్స్ లో ఎక్కడ డ్రాప్ లేకుండా స్టడీగా సాగుతోంది. శివకార్తికేయన్ ఈ సినిమా కోసం మేజర్ ముకుంద్ వరదరాజన్ గా నటించాడు. అందుకోసం కఠినమైన డైట్ ఫాలో ఫాలో అయి లుక్ కూడా చేంజ్ చేసాడు. అయితే మేకోవర్ చేంజ్ చేసుకుని అచ్చు మెజర్ ముకుందన్ లా గెటప్ లో తన శ్రీమతి ఆర్తి ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు తెలియకుండా సైలెంట్ గా వెనుక నుండి వెళ్లి ఆర్తికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు శివకార్తికేయన్. ఈ స్వీట్ మూమెంట్ ను కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన స్వీట్ శ్రీమతికి స్వీట్ గిఫ్ట్ అని, ఎంత క్యూట్ గా ఉందొ ఈ వీడియో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments