NTV Telugu Site icon

SK : ‘అమరన్’ మేజర్ ముకుంద్ కు ఘనమైన నివాళి..

Amran

Amran

తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని మరోసారి పెంచింది.

తెలుగులో ఈ సినిమా ట్రైలర్ న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ పరిశీలిస్తే నా ఎదురుగా ఎవరు ఉన్న సరే భయపడే ప్రశ్న లేదనే మేజర్ ముకుంద్ ఒరిజినల్ క్లిప్స్ ను చూపిస్తూ, ఈ నింగికి కడలికి మధ్య ఉన్న దూరమే మన నాకు తనకు అని సాయి పల్లవి చేప్పిన డైలాగ్స్ మనసుని హత్తుకున్నాయి. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథను కళ్ళకు కట్టినట్టు చుపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆర్మీలో చేసిన సేవలు, యుద్ధంలో ఆయన సాహసాలతో పాటు ఎమోషన్‌ని కూడా పర్ఫెక్ట్ చూపించారు. ప్రాణం కంటే దేశమే ముఖ్యం అనుకునే ముకుంద్ చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఇక జివి.ప్రకాశ్ కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడి టేకింగ్ ఈ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది అమరన్.

Also Read : KA : కిరణ్ అబ్బవరం ‘క’ ట్రైలర్ నేడే రిలీజ్

Show comments