SJ Suryah leaked Saripodhaa Sanivaaram Story: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా నానికి విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నాడు. అదితి బాలన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవుతుంది కానీ ఇప్పటివరకు సినిమా మీద సరైన బజ్ లేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది సినిమా యూనిట్. అందులో భాగంగానే టీవీ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎస్జే సూర్య ఎన్టీవీకి కూడా ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సరిపోదా శనివారం సినిమా లైన్ ఆయన లీక్ చేసేసారు. ఈ సరిపోదా శనివారం అనే సినిమా లైన్ రజనీకాంత్ భాషా సినిమా లైన్ ని పోలి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Bithiri Sathi: భగవద్గీతను అవమానించి, సారీ చెప్పమంటే బిత్తిరి సత్తి షాకింగ్ రియాక్షన్?
నాని చిన్నప్పటినుంచి ఆవేశపరుడుగా ఉంటే అది ఎప్పటికైనా అనర్థమే అని భావించి నాని దగ్గర అతని తల్లి మాట తీసుకుంటుందట. పూర్తిగా గొడవలు జోలికి వెళ్లకుండా ఉండమంటే అది జరిగే పని కాదని భావించి వారంలో శనివారం మాత్రమే గొడవలకు వెళ్లాలని మిగతా రోజులు కంట్రోల్ చేసుకునే ఉండాలని మాట తీసుకుంటుందట. ఈ లైన్ ని బేస్ చేసుకుని మిగతా డ్రామా అంతా వివేక్ ఆత్రేయ రాసుకున్నాడని లైన్ విన్నప్పుడే తనకు సినిమా భలే నచ్చేసి వెంటనే చేస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సూర్య చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటివరకు ఆ డేట్ ని మరే పెద్ద సినిమాలు బ్లాక్ చేసుకోలేదు కాబట్టి నానికి ఈ సినిమా సోలో రిలీజ్ అని చెప్పొచ్చు. నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి అనే సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కానీ ఈ సినిమా అయితే కనెక్ట్ అవుతుంది అని చెబుతున్నారు. ఈ సినిమాకి దాదాపు 150 కోట్లు బడ్జెట్ అయిందని నాని కెరియర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ సినిమా అని అంటున్నారు. ఈ సినిమాలో సోకుల పాలెం అనే ప్రాంతాన్ని ప్రత్యేకంగా సెట్ వేసి సృష్టించినట్లు కూడా సినిమా టీం చెబుతోంది.