Site icon NTV Telugu

అనుతో అల్లు శిరీష్… రొమాంటిక్ గా ప్రీ లుక్

Sirish6 First Look on ???? ???

అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ చాలా కాలం గ్యాప్ తరువాత ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం భారీగానే కండలు పెంచేసాడు. ఆ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు శిరీష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రీ లుక్ లో ముఖాలు కన్పించట్లేదు కానీ… అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ మాత్రం తెలుస్తోంది. ప్రీ లుక్ తో ఒక్కసారిగా సినిమాపై రొమాంటిక్ వైబ్స్ మొదలైపోయాయి. మే 30న అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల అవుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కిస్తున్నారు. రాకేష్ గతంలో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ ఎంట్రీ మూవీ “విజేత” చిత్రాన్ని రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.

Exit mobile version