Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ

Sing Geetam

Sing Geetam

వెండితెరపై ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి ఎన్నో అద్భుత ప్రయోగాలు, సంచలన చిత్రాలను ఆవిష్కరించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి తన మార్క్ ఆలోచనతో సింగ్ గీతం అనే సినిమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సింగీతం.  94 ఏళ్ల వయసులో కూడా  సింగీతం సినిమాపై చూపిస్తున్న పట్టుదల, ఎవరు ఊహించాని కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రియులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. ఒక వైవిధ్యమైన, విభిన్నమైన కథను సినిమా రూపంలోకి తీసుకురావాలనే సింగీతం ఆలోచనను గౌరవించి, దానికి అండగా నిలిచిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను ఈ సందర్భంగా ఖచ్చితంగా అభినందించాలి.

సింగీతం శ్రీనివాసరావుపై ఉన్న  గౌరవంతో వినూత్న ప్రయోగానికి నాగ్ అశ్విన్ తోడ్పడడం విశేషం. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన సింగ్ గీతం సినిమాకు బాక్సాఫీస్ టాక్‌తో కానీ, విశ్లేషకుల రివ్యూలతో కానీ అస్సలు పని లేదు. 94 ఏళ్ల వయసులో కూడా ఒక దర్శకుడు సినిమా కోసం చేసిన అద్భుతమైన ఐడియాని, ప్యాషన్‌ని ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి తప్పకుండా చూడాల్సిందే. ఈ వయసులో కూడా సింగీతం గారు కథను విజువలైజ్ చేసి తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ తన అద్భుతమైన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడదగ్గ ఒక గొప్ప ప్రయోగం ఇది. ముఖ్యంగా క్లైమాక్స్ మిమ్మల్ని కదిలిస్తుంది. హాస్యం, మానవత్వం, సంగీతం, భావోద్వేగాలు కలిసి రూపొందిన అద్భుతమైన దృశ్య కావ్యం సింగ్ గీతం. అనుకూర్ సీ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో పెద్ద బలం. ఇంతకుముందు వెండితెరపై ఎప్పుడూ చూడని ఒక కొత్త సినీ ప్రయోగం. ఒక్క మాటలో చెప్పాలంటే సింగ్ గీతం  ఓ మాస్టర్‌పీస్.

×
×
Ad