Kotha Malupu: జూన్ 12న సింగర్ సునీత కొడుకు రెండో సినిమా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నేపధ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొత్త మలుపు. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, ‘తథాస్తు క్రియేషన్స్’ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ను టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్నిర్వహించారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, సీనియర్ నటుడు రఘుబాబు ముఖ్య అతిథులుగా హాజరై అఫీషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఇక ట్రైలర్ పరిశీలిస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథకు సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో గాయని సునీత మాట్లాడుతూ.. ఆకాష్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, ఇది అతనికి రెండో సినిమా అని తెలిపారు. కొత్త వారైనా దర్శకుడు శివ, నిర్మాత బాలకృష్ణ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశారని, అందరూ ఆదరించాలని కోరారు. ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న సీనియర్ నటుడు భానుచందర్, నిర్మాత సి. కళ్యాణ్, నటుడు రఘుబాబు చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించారు. మైత్రి మూవీస్ బ్యాకింగ్ ఉందంటేనే కంటెంట్‌లో ఎంత దమ్ముందో అర్థమవుతుందని, చిన్న సినిమాగా విడుదలవుతున్న ‘కొత్త మలుపు’ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!