Site icon NTV Telugu

Rahul Sipligunj : ప్రేయసితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

Rahul Simplagunj

Rahul Simplagunj

టాలీవుడ్ ప్రముఖ సింగర్  రాహుల్ సిప్లిగంజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించిన రాహుల్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తోను తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్. ఓ వైవు సినిమా సాంగ్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బిజిగా ఉన్న రాహుల్ తన ఫ్యాన్స్ కు సప్రయిజ్ ఇచ్చాడు.

Also Read : PawanKalyan : పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న తమిళ్ బ్యూటీ.. ఎందుకంటే?

మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సింగర్ గా ఉన్న రాహుల్ ఇప్పుడు సింగిల్ లైఫ్ కు సెండాఫ్ ఇస్తూ ఒకింటి వాడు అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని అతి కొద్ది మంది సన్నిహితులు,చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు, మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి అధికారిక ఫోటోలను విడుదల చేయలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.  రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీ ధరించగా  అయితే హరిణి ఆరెంజ్ లెహంగాలో మెరిసింది. వేద పండితుల సాక్షిగా ఒక్కటైన ఈ నూతన జంటకు అటు సినీ పరిశ్రమ నుండి ఇటు రాహుల్ అభిమానుల నుండి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version